The Stairs – The short film
THE STAIRS ( Short Film )
ఈ రోజు మీకు ‘ది స్టయిర్ ‘ షాట్ ఫిల్మ్ పరిచయం చేయబోతున్నాను .ఈ చిత్రం 23 అంతర్జాతీయ చిత్రోత్సవాలల్లో ప్రదర్శింపబడినది.ఉత్తమ లఘు చిత్రం గా ప్రశంసలుపొందడమేకాకుండా ఉత్తమ లఘు చిత్ర దర్శకుడిగా హకీం రీగన్ ఫ్లాగర్ చిత్రోత్సవంలో సత్కరించబడ్డారు.రోమానియా,భారత దేశం , కెనడా,ఇజరాయల్,సౌత్ ఆఫ్రికా ,స్లొవనియా ,అమెరికా,మెకిడొనియా దేశాల్లో ఈ చిత్రం లఘు చిత్రాల విభాగంలో ప్రదర్శింపబడింది.మోర్ట్ లైట్నెర్ వ్రాసిన నవల ” ఎ హేబ్రాయిక్ అబ్సెషన్ ” ను ఆధారం చేసుకుని నిర్మించిన లఘు చిత్రం ఇది . కథలోకి వస్తే పది సంవత్సరాల కుర్రాడు మెట్ల పై దాక్కుని తన తండ్రి నాజీలు చేసిన మారణహోమం నుండి తప్పించుకున్న ఘోరమైన సంఘటను గురించి చెపుతుంటే భయంతో దాక్కొని వింటుంటాడు.కాలక్రమం లో తన తండి కాలం చేశాడు .ఇప్పుడు ఆ కుర్రవాడికి యాభై ఏళ్ళు వచ్చాయి .ఒక రోజు తన చేతికి ఒక క్యాసెట్ దొరుకుతుంది.అది తను చనిపొవడానికి ఆరు మాసాలు ముందుగా మాట్లాడిన మాటలు అందులో వున్నాయి.హోలోకాస్ట్ మ్యూజియం వారికి ఇంటెర్వెవ్ ఇచ్చిన సంధర్భంగా రికార్డ్ చేయబడ్డ సంభాషణ వుంటుంది.ఒక కొడుకుగా ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు ఇది వరకు తన తండ్రి ఎవరికి చెప్పనన్ని భావొద్వేగాలు,ప్రశ్చాతాపాం,నిజాలు అందులో వుంటుంది. దర్శకుడు :హకీం రీగన్ , నిర్మాత : బ్లేక్ లైట్నెర్ , కథ : మోర్ట్ లైట్నెర్
Thanks Kirin for making my day. Thanks Maurice for going the extra step. Thanks Google for your wonderful inventions.
ట్రైలర్ చూడవచ్చు ఇక్కడ ( Trailer The stairs )